
బాలీవుడ్ అందాల తార కరిష్మా కపూర్ 90’sలో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. అయితే, ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో తిప్పలు ఎదుర్కొంది. ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్‌తో ప్రేమలో ఉన్న కరిష్మా, అతనితో నిశ్చితార్థం చేసుకుంది. ఇరు కుటుంబాలు అంగీకరించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఈ పెళ్లి రద్దయింది. ఆ తర్వాత 2003లో వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను వివాహం చేసుకుంది. కానీ ఈ పెళ్లి కరిష్మా జీవితాన్ని పూర్తిగా నాశనం చేసింది.
కరిష్మా తన భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. హనీమూన్ సమయంలో తనను భర్త “auction” చేయాలని చూసాడని, అతని friendsతో రాత్రి గడపమని ఒత్తిడి చేశాడని వెల్లడించింది. అంగీకరించకపోవడంతో ఆమెను హింసించాడని పేర్కొంది. అంతేకాకుండా, గర్భిణిగా ఉన్న సమయంలో తన అత్తయ్య తనను physically attack చేసిందని తెలిపింది.
ఈ వివాహ బంధాన్ని నిలబెట్టుకోవడానికి చాలా ప్రయత్నించినప్పటికీ, కరిష్మా చివరకు 2014లో విడాకుల కోసం దరఖాస్తు చేసింది. 2016లో వారి విడాకులు అధికారికంగా ఖరారయ్యాయి. సంజయ్ తన మొదటి భార్యతో సంబంధం కొనసాగిస్తున్నాడని, పెళ్లి తర్వాత కూడా ఇద్దరికి విడిపోకపోవడం తనకు మానసికంగా తీవ్ర క్షోభ కలిగించిందని కరిష్మా పేర్కొంది.
ప్రస్తుతం, కరిష్మా కపూర్ ఒంటరిగానే ఉంటూ తన పిల్లల భవిష్యత్తును ప్రాధాన్యతనిస్తోంది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలను అధిగమించి, సొంతంగా ఎదగడం ద్వారా చాలా మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. సెలబ్రిటీల జీవితంలోనూ toxic relationships ఉంటాయని, మహిళలు తమకు న్యాయం జరిగేలా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కరిష్మా కథ చెబుతోంది.