Published on Dec 30, 2024 11:00 AM IST
స్టార్ దర్శకుడు శంకర్ – గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10, 2025న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఐతే, ఈ పొలిటికల్ డ్రామా ట్రైలర్ ను జనవరి 1న విడుదల చేస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు తెలిపిన సంగతి తెలిసిందే. ఐతే, ఈ సినిమాలో చరణ్ పాత్రకు సంబంధించిన మూడో గెటప్ తాలూకు ఎలివేషన్స్ ను కూడా ఈ ట్రైలర్ లో రివీల్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్ ఫైనల్ కట్ పూర్తి అయిందట.
కాగా ట్రైలర్ లో చరణ్ రెండు పాత్రల లుక్స్, ఎమోషన్స్.. ప్రధానంగా శంకర్ మార్క్ యాక్షన్ అండ్ టెక్నికల్ టేకింగ్ తో పాటు తమన్ బీజీఎం కూడా మెయిన్ హైలైట్ గా ఉండబోతున్నాయని తెలుస్తోంది. మొత్తానికి ఫ్యాన్స్ ని ఈ ట్రైలర్ ఫిదా చేస్తోందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. అన్నట్టు ఈ సినిమా నుంచి రెండు ట్రైలర్లు వస్తాయని టాక్ నడుస్తోంది. రెండు ట్రైలర్స్ విభిన్నంగా ఉంటాయని, ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ ట్రైలర్స్ ను రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇక సంక్రాంతికి విడుదలవుతున్న భారీ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. మరో కీలక పాత్రలో అంజలి కనిపించనుంది. అన్నట్టు గేమ్ ఛేంజర్ నార్త్ ఇండియా థియేటర్స్ రైట్స్ ను అనిల్ తడాని యొక్క AA ఫిల్మ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.