Published on Dec 18, 2024 2:21 AM IST
ఇప్పుడు మన తెలుగు సినిమా నుంచి రిలీజ్ కి రాబోతున్న మరో భారీ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “గేమ్ ఛేంజర్” కూడా ఒకటి. మరి చరణ్, శంకర్ ఇద్దరి కెరీర్ లో 15వ సినిమాగా నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో 50వ సినిమాగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.
అయితే ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తుండగా ఈ సినిమా ఫలితం ఇపుడు అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అలాగే శంకర్ అభిమానులకి కూడా ఎంతో ప్రత్యేకంగా మారింది. మరి గేమ్ ఛేంజర్ తో శంకర్ సాలిడ్ కం బ్యాక్ కొట్టబోతున్నారని మెగా వర్గాల నుంచి టాక్ ఉండగా ఇపుడు సినీ వర్గాల్లో కూడా గేమ్ ఛేంజర్ అవుట్ పుట్ పై సాలిడ్ బజ్ వినిపిస్తుంది.
ఇలా గేమ్ ఛేంజర్ లో మూడు బిగ్గెస్ట్ హైలైట్స్ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేయబోతున్నాయట. వీటిలో మొదటిగా శంకర్ మార్క్ సాంగ్స్ విజువల్ పరంగా ఓ రేంజ్ లో ట్రీట్ ఇవ్వనుండగా ఇవి కాకుండా సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ లు సినిమాలో అద్దిరిపోతాయని తెలుస్తుంది. దీనితో “గేమ్ ఛేంజర్” తో మాత్రం శంకర్ మాస్ సంభవం లోడింగ్ అని చెప్పాలి.