Tollywood 2024 : టాలీవుడ్ లో అడుగుపెట్టిన ముద్దుగుమ్మలు వీరే

  • మిస్టర్ బచ్చన్‌లో హోయలొలికించిన భాగ్యశ్రీ బోర్సే
  • ఓం భీమ్ బుష్ అంటూ మాయ చేసిన ప్రీతి ముకుందన్
  • దేవరతో టీటౌన్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ

2024లో కొత్తందాలు టాలీవుడ్ ను పలకరించాయి. తమ టాలెంట్ ప్రూవ్ చేసుకునేందుకు, తమ లక్ ను పరీక్షించుకునేందుకు న్యూ భామలు  టాలీవుడ్ కు క్యూ కట్టారు. ఇండియన్ ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ లా మారిన టీటౌన్ లో తమను తాము ప్రూవ్ చేసేందుకు ఎగబడుతున్నారు కొత్త భామలు. 2024లో ఎంతో మంది న్యూ గర్ల్స్ టాలీవుడ్ తెరంగేట్రం ఇచ్చి సినీ ప్రియుల్ని గిలిగింతలు పెట్టేశారు. వీరిలో ముందు వరుసలో ఉంటుంది భాగ్యశ్రీ బోర్సే. రవితేజ మిస్టర్ బచ్చన్ తో ఓవర్ నైట్ గ్లామరస్ బ్యూటీగా మారిపోయింది ఈ అమ్మాయి. సినిమా సక్సెస్ కొట్టకపోయిన ఆఫర్లకు వచ్చిన కొదవ లేదు.

అతిలోక సుందరి తనయగా బాలీవుడ్ లో ఫ్రూవ్ చేసుకున్నజాన్వీ కపూర్.  ఎన్టీఆర్ తో నటించిన దేవరతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. ప్రెజెంట్ రామ్ చరణ్ సినిమాలో నటిస్తుంది. ఓం భీమ్ బుష్ తో మాయ చేసింది ప్రీతి ముకుందన్. 2024లో టీటౌన్ ఎంట్రీ ఇచ్చిన కొత్త భామల్లో సక్సెస్ అందుకున్నారు ఈ ఇద్దరు. ఇక ఆపరేషన్ వాలంటైన్ తో తెరంగేట్రం చేసింది 2017 మిస్ వరల్ట్ మానుషి చిల్లర్. సినిమా ఫట్ మనేసరికి ఈమెను పట్టించుకోలేదు తెలుగు ఆడియన్స్. ఇక మెరుపులు మెరిపిస్తుందేమో అనుకున్న రుక్మిణీ వసంత్ ఎలాంటి మ్యాజిక్ చేయలేకపోయింది. ప్రతినిధితో సిరి లెళ్ల ఎంట్రీ ఇచ్చింది. వీరితో పాటు కృష్ణమ్మతో అతిరా రాజీ, లవ్ మౌళీతో పంఖూరి గిద్వానీ బ్యూటీఫుల్ గా కనిపించారు కానీ సక్సెస్సయితే అందుకోలేకపోయారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *