2024 వెళ్లిపోయి 2025లోకి అడుగుపెట్టడానికి ఇంకో రోజు మాత్రమే వుంది. ఈ ఏడాది కూడా ఎప్పటిలాగానే సక్సెస్ పర్సెంటేజ్ 10 శాతమే. అయితే ఈ పది శాతంలో ఎక్కువ పర్సెంటేజ్ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన మూవీస్‌దే. ఇది వినడానికి ఆశ్యర్యంగా వున్నా గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఓ అరడజను సినిమాలు బాక్సాఫీస్‌ను కొల్లగొట్టాయి. చాలాకాలంగా సినిమా కథలు మల్టీప్లెక్సుల చుట్టూ తిరుగుతున్నాయి. పబ్ కల్చర్‌తో హోరెత్తిస్తాయి. అయితే ఈఏడాది తెలుగు సినిమాలు కథలు పల్లెటూరి బాట పట్టాయి. సిటీ హడావుడితో బోర్ ఫీలైన ఆడియన్స్ కూడా ఇలాంటి కథలు ఫిదా అయ్యారు. ఇరుకైన మట్టి రోడ్లు, పొలాలు, చెట్టు చేమ, కొండల చుట్టూ తిరిగిన ఫీలింగ్ ఇచ్చాయి.
హనుమాన్‌తో ఈ ట్రెండ్ మొదలై కిరణ్ అబ్బవరం’ ‘క’ వరకు విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ సినిమాలదే పైచేయిగా నిలిచింది. తేజు హీరోగా ప్రశాంత్ వర్మ సృష్టించిన ఈ విజువల్ వండర్‌ను రూ. 30 కోట్లకు అమ్మితే రూ. 148 కోట్ల షేర్ తీసుకొచ్చింది. ఈ విలేజ్ సెంటిమెంట్ చిన్న చిత్రాలకు బాగా కలిసొచ్చింది. ఆయ్‌లో హీరోహీరోయిన్లు, డైరెక్టర్‌కు పెద్ద క్రేజ్ లేకపోయినా ఔట్ అండ్ ఔట్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ లవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఆకట్టుకుంది. ఈ లో బడ్జెట్ మూవీని మూడున్నర కోట్ల తో ఎనిమిదన్నర కోట్లు తీసుకొచ్చింది. ఈ ఏడాది చాలా చిన్న చిత్రాలు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌నే నమ్ముకున్నా కొన్ని సినిమాలే సక్సెస్ బాట పట్టాయి. ఎలాంటి జానర్‌తో తీసినా సినిమా బాగుంటే చాలు. ఎలాంటి బ్యాక్‌గ్రాప్‌తో తీశారో పట్టించుకోకుండా ఆదరించారు ఆడియన్స్. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నవ్వించిన ‘ ఓం భీమ్ బుష్’ ఇలాంటి జోనర్ లోనే వచ్చి హిట్ గా నిలిచింది.
అది హారర్ సస్పెన్స్ మూవీ అయినా పల్లెటూరును నమ్ముకుంటే చాలు, పిరియాడిక్ బ్యాక్‌డ్రాప్ అయినా, మైథలాజికల్ లింక్‌తో తీసినా ప్రకృతి ఒడిలో షూట్ చేస్తే సక్సెస్ వచ్చినట్టే ఈ ఏడాది బ్రేక్ ఈవెన్ అయిన ఆ సినిమాలేమిటో చూద్దాం. వరుస ఫ్లాపులతో విసిగిపోయిన కిరణ్ అబ్బవరం ‘క’ హిట్ కాకపోతే యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేస్తానని ఓపెన్‌గా చెప్పేశాడు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ‘క’కు స్క్రీన్‌ప్లేతోపాటు విలేజ్ బ్యాక్‌డ్రాప్ ప్లస్ అయి.. లాభాలు తీసుకొచ్చింది. అలాగే కొత్త వాళ్లతో వచ్చిన కమిటీ కుర్రాళ్లు పల్లెటూరి జ్ఞాపకాలను గుర్తుచేసింది. చిన్న సినిమాలే కాదు పెద్ద హీరోలు కూడా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో హిట్ కొట్టారు. నాగార్జున, అల్లరి నరేశ్ నటించిన నా సామిరంగా సంక్రాంతికి రిలీజైన విజయం సాధించింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ నాగ్‌కు కలిసొచ్చాయి. ప్రెసిడెంటుగారి పెళ్లాం, సోగ్గాడే చిన్నినాయన, బంగర్రాజులాతోపాటు నా సామిరంగతో మరో సక్సెస్ అందుకున్నాడు. కొరటాల శివ సృష్టించిన ఓ అరుదైన పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో ‘దేవర కథ నడించింది. చాలావరకు విఎఫ్‌ఎక్స్‌తో పల్లెటూరి వాతావరణాన్ని, సముద్రాన్ని సృష్టించినా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. టాక్ తో సంబంధం లేకుండా మంచి లాభాలు తీసుకొచ్చింది దేవర.