
స్టార్ హీరోయిన్ మంజిమా మోహన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాల్యంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంజిమా, కొన్నేళ్ల తర్వాత హీరోయిన్ గా మారింది. మొదట తమిళ, మలయాళ సినిమాల్లో నటించినా, నాగ చైతన్య హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా ఆమెకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
చిన్నతనంలోనే టీవీ షోలు, సినిమాల్లో నటించిన మంజిమా, చదువు కోసం కొంత గ్యాప్ తీసుకుంది. అయితే మళ్లీ హీరోయినుగా రీఎంట్రీ ఇచ్చి శింబు, విజయ్ సేతుపతి, నివీన్ పౌలి, విక్రమ్ ప్రభు వంటి స్టార్ హీరోలతో నటించింది. తెలుగులో మాత్రం మూడే సినిమాలు చేసింది. బాలకృష్ణ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో నారా భువనేశ్వరి పాత్రలో మెరిసింది.
కెరీర్ పీక్స్ లో ఉండగానే, మంజిమా మోహన్ సీనియర్ నటుడు కార్తీక్ కొడుకు హీరో గౌతమ్ కార్తీక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ ఓ సినిమాలో కలిసి నటించగా, అప్పుడు ప్రేమ మొదలైంది. 2022లో పెద్దల అనుమతితో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత మంజిమా సినిమాలకు దూరమైంది.
ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ గా ఉంటోంది. భర్త గౌతమ్ కార్తీక్ మాత్రం పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. అభిమానులు మంజిమా మోహన్ రీఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.