“విశ్వంభర” టీజర్ లో ఇది పీక్ షాట్.. గమనించారా? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “విశ్వంభర” కోసం తెలిసిందే. మరి మేకర్స్ నేడు ఈ సినిమా నుంచి విజయదశమి కానుకగా సాలిడ్ టీజర్ కట్ ని విడుదల చేశారు. అయితే ఇందులో ఊహించని విజువల్స్ క్రేజీ ఎలిమెంట్స్ తో అభిమానులకి నచ్చింది. మరి ఈ టీజర్ లో మెగాస్టార్ పై కొన్ని సాలిడ్ మూమెంట్స్ కూడా కనిపించాయి.

కానీ ఈ మధ్య కాలంలో పలు టీజర్ లకి ఒక పర్టిక్యులర్ షాట్ బాగా పీక్ లో ఫీల్ ని అందిస్తుంది. అలా రీసెంట్ గా “దేవర” టీజర్ లో సొర చేపపై షాట్ మంచి ఆదరణ అందుకుంది. అలా ఇప్పుడు విశ్వంభర టీజర్ లో కూడా ఓ క్రేజీ షాక్ అదిరింది అని చెప్పొచ్చు. టీజర్ ఎండింగ్ లో హనుమంతుని ముందు మెగాస్టార్ పై ఓ ఫైట్ సీక్వెన్స్ కనిపిస్తుంది.

మరి ఈ ఫైట్ లో ఓ షాట్ చిరు కూడా గదాదండం పట్టుకొని హనుమంతుని ముందు మంచి అగ్రెసివ్ పోస్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే హనుమంతుని ముందు చిరు కూడా హనుమంతులువారి లానే కనిపిస్తారు కానీ ఇంకా సరిగ్గా చూస్తే ఆ అంజనీ పుత్రుని దీవెనలు ఈ అంజనీ పుత్రునికి అందించినట్టుగా కుడి చేయి అభయ హస్తం చిరు వైపు దీవెనలు అందిస్తున్నట్టుగా కనిపిస్తుంది.

ఇది మాత్రం మంచి పీక్ హైలైట్ షాట్ అని చెప్పాలి. అలాగే దీనికి సినిమాటోగ్రఫీ అందించిన చోటా కే నాయుడుకి ఆ క్రెడిట్ దక్కుతుంది అని చెప్పొచ్చు. మరి ఈ చిత్రంలో ఇలాంటి ఐకానిక్ షాట్స్ ఇంకెన్ని ఉన్నాయో వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

The post “విశ్వంభర” టీజర్ లో ఇది పీక్ షాట్.. గమనించారా? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *