ఈ కీలక సీన్ ని కూడా “పుష్ప 3” కే షిఫ్ట్ చేసేసారట | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 19, 2024 9:03 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం పుష్ప 2 ది రూల్ ఏ రేంజ్ లో అదరగొడుతుందో తెలిసిందే. భారీ వసూళ్ల మార్క్ ని అత్యంత వేగంగా అందుకుంటూ ఈ సినిమా దూసుకెళ్తుంది. అయితే పుష్ప 2 చూసిన తర్వాత చాలా ప్రశ్నలే వచ్చాయి.

సినిమా టీజర్ లో చూపించిన చాలా సన్నివేశాలు, అలాగే ట్రైలర్ లో చూపించిన పలు షాట్స్ కూడా సినిమాలో లేవు. దీనితో ఇవన్నీ పార్ట్ 3 లో ఉంటాయని తెలిసింది. అయితే పుష్ప 2 లోనే ఓ కీలక ఎమోషనల్ సీన్ కూడా ఉండుంటే ఎమోషన్ కంప్లీట్ అయ్యి ఉండేది అని ఆడియెన్స్ లో ఓ వెలితి ఉంది. క్లైమాక్స్ లో అజయ్ రోల్ రియలైజ్ అయ్యి తన పుష్పని తమ ఇంట్లో ఒకడిగా చేరదీస్తారు.

మరి ఈ సమయంలో పార్ట్ 1 లో పుష్ప చిన్నపుడు తన దగ్గర లాక్కున్న లాకెట్ ని మళ్ళీ తిరిగి ఇచ్చి ఉండుంటే బాగుండు అని చాలా మందికి అనిపించింది. అయితే ఆ సీన్ సినిమాలో చూపించకపోయేసరికి లేదేమో అనుకున్నారు కానీ ఈ సీన్ సినిమాలో ఉందట. దీనిని పార్ట్ 2 కి షిఫ్ట్ చేసినట్టుగా ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. సో ఆ సీన్ లేదని బాధ పడిన వారు అంతా ఇపుడు ఈ విషయంలో ఫీల్ కావాల్సిన పని లేదని చెప్పొచ్చు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *