Published on Dec 16, 2024 2:00 PM IST
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10, 2025న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఐతే, ఈ పొలిటికల్ డ్రామా నుంచి మరో సాంగ్ రిలీజ్ కానుంది. ‘తర్వాతి సాంగ్ గేమ్ ఛేంజర్‌ను సౌండ్ ఛేంజర్‌గా మారుస్తుంది’ అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్వీట్ చేయడంతో ఇప్పుడు ఈ సాంగ్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. DHOP అంటూ సాగే ఈ సాంగ్ సాయంత్రం 6 గంటలకు రిలీజ్ అవుతుందని, ఆ తర్వాత దీని గురించి ప్రపంచమే మాట్లాడుకుంటుందని తమన్ చెప్పుకొచ్చాడు.
కాగా తమన్ ఈ సాంగ్ పై ఈ రేంజ్ లో కామెంట్స్ చేయడంతో మెగా ఫ్యాన్స్ కి సాంగ్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మొత్తానికి మెగా అభిమానులు ఈ సాంగ్ కోసం చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరి వారి అంచనాలను ఈ పాట అందుకుంటుందో లేదో చూడాలి. పైగా ఈ సంక్రాంతికి విడుదలవుతున్న భారీ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. మరో కీలక పాత్రలో అంజలి కనిపించనుంది. అన్నట్టు గేమ్ ఛేంజర్ నార్త్ ఇండియా థియేటర్స్ రైట్స్ ను అనిల్ తడాని యొక్క AA ఫిల్మ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.