అఫీషియల్: సంక్రాంతికి రానున్న NBK109 | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 27, 2024 3:00 PM IST

ప్రస్తుతం నందమూరి అభిమానులు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కొట్టిన “దేవర” విజయంతో ఫుల్ ఖుషి గా ఉన్నారు. దీనితో ఇక ఈ భారీ సినిమా తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ అప్డేట్స్ కోసం కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

అయితే కొన్నాళ్ల నుంచి మాత్రం సినిమా టైటిల్ ఏంటి అనేది చాలా సస్పెన్స్ గా మారింది. ఇలా పలు ఆసక్తికర, పవర్ఫుల్ టైటిల్స్ కూడా ఈ సినిమాకి వినిపించాయి కానీ వాటిలో “డాకు మహరాజ్” కూడా ఒకటి. మరి ఈ టైటిల్ విషయంలో మాత్రం ఎలాంటి నిజం లేదు అని తెలుస్తోంది.

సో ఇది కాకుండా మిగతా టైటిల్స్ లో ఏదొకటి ఫిక్స్ చేసి ఉంటారనికి చెప్పాలి. మరి అది తెలియాలి అంటే ఈ కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఈ అవైటెడ్ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *