- పుష్ప-2 తొక్కిసలాట కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
- సంధ్య థియేటర్ యజమానితోపాటు మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ అరెస్ట్
- అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు
Pushpa 2 Stampede: పుష్ప-2 తొక్కిసలాట కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ యజమానితోపాటు మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్‌ను కూడా అరెస్ట్ చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు చిక్కడపల్లి పోలీసులు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద ఈ నెల 4వ తేదీ రాత్రి పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. బాలుడు తీవ్రంగా గాయపడి హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సినీ నటుడు అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఇవాళ ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు చిక్కడపల్లి పోలీసులు వెల్లడించారు.
Read Also: Manchu Manoj: మంచు మనోజ్‌కు వైద్య పరీక్షలు పూర్తి.. డాక్టర్లు ఏం చెప్పారు?