హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “ఫియర్”. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. “ఫియర్” సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో “ఫియర్” మూవీ హైలైట్స్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు డైరెక్టర్ డా. హరిత గోగినేని. ఆమె మాట్లాడుతూ నాకు సినిమాలంటే ఇష్టం.
Pragya Nagra: ప్రయివేట్ వీడియో లీక్.. స్పందించిన టాలీవుడ్ హీరోయిన్
చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగాను. బుక్స్ చదివే అలవాటు ఉంది. కొన్ని కథలు రాసుకున్నాను. క్రమంగా డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. మూడేళ్ల క్రితం “ఫియర్” సినిమా ఆలోచన మొదలైంది. అయితే అప్పుడు లక్కీ లక్ష్మణ్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాం. అది కంప్లీట్ అయ్యాక పూర్తిగా ఈ సినిమా మీదే దృష్టి పెట్టామని అన్నారు. వేదిక కంటే ముందు మరికొందరు హీరోయిన్స్ ను అప్రోచ్ అయ్యాం. అయితే వాళ్ల డేట్స్ కోసం ఏడాది పాటు ఆగాలని చెప్పారు. అంత టైమ్ వెయిట్ చేయడం ఇష్టం లేక కొన్నిఆప్షన్స్ చూశాం. వేదిక ముని, కాంచన 3 వంటి మూవీస్ లో బాగా నటించింది. మా సబ్జెక్ట్ కు కూడా చాలా యాప్ట్ అనుకుని ఆమెను సంప్రదించాం. కథ విన్న తర్వాత వేదిక కూడా వెంటనే ఓకే చెప్పింది. నేను అనుకున్న కథలో వేదికను ఊహించుకుంటే ఆమె పర్పెక్ట్ అనిపించిందని అన్నారు.