టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు ముఖ్యం కాదు – దిల్ రాజు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

తెలుగు సినిమా ఇండస్ట్రీ నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో జరగగా, సినిమా ఇండస్ట్రీ నుండి 36 మంది సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఇక ఈ భేటీ అనంతరం దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు.

సినిమా ఇండస్ట్రీకి సీఎం రేవంత్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారని.. అయితే, హైదరాబాద్‌ను ప్రపంచస్థాయిలో ఎంటర్‌టైనింగ్ హబ్‌గా తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని సీఎం సూచించారని దిల్ రాజు తెలిపారు. ఇప్పుడు టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలకు సంబంధించిన చర్చ జరగలేదని.. అది చాలా చిన్న విషయమని.. ఇండస్ట్రీ గ్రోత్ అనేది ముఖ్యమని సీఎం సూచించినట్లు దిల్ రాజు పేర్కొన్నారు.

దీంతో ఇక తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఉండబోవు అనేది మరోసారి కన్ఫర్మ్ అయ్యింది. ఇంకోసారి సినీ పరిశ్రమ మీటింగ్ పెట్టి, తమ సమస్యలను సీఎంకు వివరిస్తామని దిల్ రాజు తెలిపారు.

The post టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు ముఖ్యం కాదు – దిల్ రాజు first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *