రీసెంట్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ టిల్లు స్క్వేర్ సినిమా ఓటీటీ డేట్ కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. టిల్లు స్క్వేర్ హిందీ సహా తెలుగు,తమిళ, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుంది. గత నెల 29వ తేదీన రిలీజైన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ దగ్గర దాదాపు 125 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.

యూఎస్ లో 3 మిలియన్ కలెక్షన్స్ అందుకుంది. మహేశ్ లాంటి స్టార్ హీరో చేసిన గుంటూరు కారం సినిమా సాధించలేని 3 మిలియన్ ఫీట్ ను టిల్లు స్క్వేర్ చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, నేహా శెట్టి కీ రోల్స్ చేసిన ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు.