Published on Oct 11, 2024 6:17 PM IST
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’ నుంచి మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటెసీ మూవీలో చిరంజీవి సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్స్ ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక దసరా కానుకగా ఈ సినిమా టీజర్‌కు మేకర్స్ టైమ్ ఫిక్స్ చేశారు.
విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌ని దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 12న ఉదయం 10.49 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ సరికొత్త పోస్టర్‌తో వారు ఈ అనౌన్స్‌మెంట్ చేశారు. ఇక ఈ పోస్టర్‌లో చిరు మరోసారి ఫెరోషియస్ లుక్‌లో కనిపించాడు. చేతిలో కత్తి పట్టుకుని ఆయన నిల్చున్న స్టైల్ అభిమానులకు సాలిడ్‌గా అనిపించింది.
ఈ సినిమాలో అందాల భామ త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. మరి ఈ సినిమా టీజర్ ఎలా ఉండబోతుందో.. అది ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.