అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ‘బుజ్జి తల్లి’ సాంగ్ ఎలాంటి వైబ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే, ఇప్పుడు ఈ సినిమాలోని రెండో సింగిల్ సాంగ్‌ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాలోని శివశక్తి పాటగా రానున్న ‘నమోనమ: శివాయ’ సాంగ్‌ను డిసెంబర్ 22న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. కాగా, ఈ పాటను డిసెంబర్ 22న సాయంత్రం 5 గంటలకు కాశీ లోని నమో ఘాట్‌లో లాంచ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ పాటకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నాగచైతన్య, సాయి పల్లవి శివపార్వతుల వలె నాట్య భంగిమలో నిల్చున్న పోజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.
The post ‘తండేల్’ నుంచి శివశక్తి సాంగ్ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.