Mon. Oct 13th, 2025
Tollywood : సినిమాల రిలీజ్ ను డిసైడ్ చేస్తున్న ఓటీటీ.. స్టార్ హీరో సినిమా రైట్స్ ఇప్పటికి పెండింగ్

సినిమా ఎలా వున్నా టీజర్‌ ట్రైలర్‌తో మెప్పిస్తే ఓటీటీలు ముందుకొస్తాయి. లేదంటే నిర్మాతలు డిజిటల్‌ సంస్థల వెనకాల పడాల్సి వస్తోంది. ఓటీటీ డీల్‌ కాకుండా సినిమాలను రిలీజ్‌ చేయడానికి నిర్మాతలు భయపడుతున్నారు. థియేటరికల్‌గా బ్రేక్‌ ఈవెన్‌ అయినా కాకపోయినా ఎంతో కొంత పెద్ద మొత్తం డిజిటల్‌ సంస్థల నుంచే రావడంతో వాళ్లు పెట్టిన రూల్స్‌కు తలొగ్గాల్సి వస్తోంది. సినిమా షూటింగ్‌ పూర్తయినా థియేటర్స్‌లోకి రాలేదం ఓటీటీ డీల్‌ కాలేదని అర్థం.

Additionally Learn : IdliKadai Evaluate : ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ ఓవర్శీస్ రివ్యూ..

సినిమాల రిలీజ్‌ డేట్స్‌ హీరోలు డైరెక్టర్స్‌ నిర్మాతల చేతుల్లోంచి ఓటీటీ చేతికి వెళ్లిపోయింది. సినిమా పూర్తయినా ఎప్పుడు విడుదల చేయాలో ఓటీటీ నిర్వాహకులు చెప్పాల్సిందే. వాళ్లు చెప్పిన డేట్‌కు రిలీజ్‌ చేయకపోతే దబిడిదిబిడే  ఎందుకొచ్చిన గొడవ అంటూ ఓటీటీలు నిర్ణయించిన తేదీకే వస్తున్నాయి. చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర వైపు ఓటీటీ కన్ను పడడం లేదు. టీజర్‌లోని విఎఫ్‌ఎక్స్‌ ట్రోలింగ్‌ కావడంతో రీ రైట్‌ చేస్తున్నారు. ఫస్ట్ ఇంప్రెస్‌పై నెగిటివ్‌ పడడంతో ఓటీటీలు ఆసక్తి చూడడం లేదని తెలిసింది. విఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ పూర్తయినా 2026 సమ్మర్‌కు వస్తోందని చెబుతున్నా ఓటీటీ సెటిల్‌మెంట్‌ జరిగితేగానీ.. రిలీజ్‌డేట్‌ ప్రకటించలేరు. పెద్ది సినిమా సగం షూటింగ్‌ కూడా పూర్తి కాకుండానే ఓటీటీ రైట్స్‌ అమ్ముడయ్యాయి. సినిమా 2026 మార్చి 27న థియేటర్స్‌లోకి వస్తోంది. రిలీజ్‌కు ఇంకా 9 నెలలు వుండగానే ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫిక్స్‌ తీసుకుంది. పాన్‌ ఇండియాగా రిలీజ్‌ అవుతున్న ఈసినిమాను అన్ని భాషల్లో కలిపి రూ. 105 కోట్లకు అగ్రిమెంట్‌ జరిగింది. క్రికెట్‌ బ్యాక్డ్రాప్‌తో రూపొందుతున్నపెద్ది ఓటీటీలో సెంచరీ దాటింది. ఓటీటీ సంస్థలు ముందుకు రావాలంటే గ్లిమ్స్‌,  టీజర్‌, సాంగ్‌, ఏదో ఒకటి బాగుందన్నహైప్‌ క్రియేట్‌ అయితే డిజిటల్‌ హక్కులు ఈజీగా అమ్ముడవుతాయి. బాలయ్య నటిస్తున్న అఖండ2 టీజర్‌ రిలీజ్‌ తర్వాత ఓటీటీ రూ. 80 కోట్ల ఆఫర్‌ చేసింది.