- సీఎంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు నేడు సమావేశం
- దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులతో భేటీ
- సినీ పరిశ్రమ ఇబ్బందులపై చర్చ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు నేడు సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు సీఎంతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఇండస్ట్రీ సమస్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. తెలంగాణలో ఇండస్ట్రీ అభివృద్ధితో పాటు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎంతో చర్చించనున్నారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డుల పరిశీలన.. చిన్న, మధ్య స్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపు లాంటి విషయాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.
-
26 Dec 2024 09:18 AM (IST)
నేడు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ..
నేడు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం.. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భేటీ.. సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులతో భేటీ కానున్న సీఎం