తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ దర్శకురాలు అపర్ణ మల్లాది(54) క్యాన్సర్ వ్యాధి కారణంగా మృతి చెందారు. అమెరికాలో క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కోసం వెళ్లిన ఆమె ఈ వ్యాధి తీవ్రం కావడంతో మృతిచెందారు.
నటి, రచయితగా అపర్ణ మల్లాది రాణించారు. ‘ది అనుశ్రీ ఎక్స్‌పెరిమెంట్స్’ అనే సినిమాతో అపర్ణ మల్లాది దర్శకురాలిగా పరిచయమయ్యారు. ‘పోష్ పోరీస్’ అనే వెబ్ సిరీస్‌ను ఆమె డైరెక్ట్ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ‘పెళ్లి కూతురు పార్టీ’ అనే సినిమాను రెండేళ్ల క్రితం ఆమె డైరెక్ట్ చేశారు. ఇలా తన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అపర్ణ మల్లాది కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేశారు.
అయితే, అపర్ణ మల్లాది మృతితో ఆమె కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆమె మృతి పట్ల సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
The post టాలీవుడ్‌లో విషాదం.. లేడీ డైరెక్టర్ కన్నుమూత first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.