
టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు షూటింగ్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం ‘రాజా సాబ్’ షూటింగ్‌ను అజీజ్‌నగర్ లో, ‘ఫౌజీ’ సినిమాను అల్యూమినియం ఫ్యాక్టరీ లో తెరకెక్కిస్తున్నాడు. అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న ప్రశ్న ఏమిటంటే – ప్రభాస్ ఒకే సమయంలో రెండు సెట్లలో పాల్గొంటున్నాడా? లేక అతని లేని సన్నివేశాలను ఒక చోట, అతను పాల్గొనే సీన్స్‌ను మరో చోట ప్లాన్ చేస్తున్నారా?
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా కోకాపేటలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ప్రాజెక్ట్‌పై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజా షెడ్యూల్‌లో చిరు స్పెషల్ స్టెప్పులే వేయనున్నారట. మరోవైపు, బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘అఖండ 2’ సినిమా కూడా ఏడెకరాలలో షూటింగ్ జరుపుకుంటోంది. ఫ్యాన్స్ మాత్రం శివరాత్రి స్పెషల్ అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ‘హరిహరవీరమల్లు’ సినిమా ముచ్చింతల్ లో షూటింగ్ జరుపుకుంటోంది. నిఖిల్ ‘స్వయంభూ’ సినిమా జానవాడలో జరుగుతోంది. మరోవైపు, నాని నటిస్తున్న శైలేష్ కొలనూ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటోంది. అదే ప్రదేశంలో అల్లరి నరేష్ మూవీ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి.
సాయి తేజ్ హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న కొత్త సినిమా షూటింగ్ తుక్కుగూడ లో ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇలా చూస్తే టాలీవుడ్ లో స్టార్ హీరోలు నాన్-స్టాప్ గా పని చేస్తూ అభిమానులను రెట్టింపు ఉత్సాహంలో ఉంచుతున్నారు.