
తెలుగు చిత్ర పరిశ్రమలో వేసవి వేడి కూడా షూటింగ్‌లను ఆపలేకపోయింది. టాలీవుడ్ హీరోలు నాన్‌స్టాప్‌గా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. చిరంజీవి (Chiranjeevi) తాజా చిత్రం విశ్వంభర (Vishwambhara) లో పాట చిత్రీకరణ హేలో నేటివ్ స్టూడియోలో జరుగుతోంది. ఇదే స్టూడియోలో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) నటిస్తున్న చిత్రం షూట్ కూడా జరుగుతోంది.
రవితేజ (Ravi Teja) మాస్ జాతర షూటింగ్‌తో పాటు సంపత్ నంది, శర్వానంద్ (Sharwanand) సినిమాల సెట్ వర్క్ ఇదే లొకేషన్లో జరుగుతున్నాయి. మరోవైపు ప్రభాస్ (Prabhas) తన రాజా సాబ్ (Raja Saab), ఫౌజీ (Fauji) సినిమాల మధ్య డేట్స్ బ్యాలెన్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri) కాంబోలో వస్తున్న కింగ్డమ్ (Kingdom) చిత్రం షూటింగ్ పఠాన్ చెరు పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అదే సమయంలో రామ్ (Ram Pothineni), మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్లో రాబోతున్న సినిమా షూటింగ్ రాజమండ్రి (Rajahmundry) లో జరగుతోంది.
ఇక సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) సంబరాల యేటిగట్టులో కీలక సన్నివేశాలు తుక్కుగూడలో, నిఖిల్ (Nikhil) నటిస్తున్న స్వయంభూ (Swayambhu) షూటింగ్ జన్వాడలో, తేజా సజ్జా (Teja Sajja) మిరాయ్ (Mirai) చిత్రీకరణ అల్యూమినియం ఫ్యాక్టరీలో, అలాగే సుధా కొంగర (Sudha Kongara) తెరకెక్కిస్తున్న తమిళ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ వేసవిలోనూ టాలీవుడ్ సినిమాలు పూర్తి ఉత్సాహంగా కొనసాగుతుండడం విశేషం.