మలయాళ హీరో టొవినో థామస్ 2018, ఏఆర్ఎమ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ రెండు సినిమాల్లో అతడి నటనకు తెలుగు ఆడియెన్స్ ఇంప్రెస్ అయ్యారు. ఇక ఈ హీరో ఇప్పుడు ఓ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ‘ఐడెంటిటీ’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాలో టొవినో థామస్ నటిస్తున్నాడు.
ఈ సినిమాలో స్టార్ బ్యూటీ త్రిష, విలక్షణ నటుడు వినయ్ రాయ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆద్యంతం సస్పెన్స్ అంశాలతో ఈ టీజర్ థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో మూవీపై ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ఇక ఈ సినిమాను అఖిల్ పాల్, అనాస్ ఖాన్ డైరెక్ట్ చేస్తున్నారు.
‘ఐడెంటిటీ’ సినిమాలో బాలీవుడ్ నటి మందిర బేడి, అజు వర్గీస్, షమ్మీ తిలకన్, అర్జున్ రాధాకృష్ణన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జనవరి నెలలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
The post ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రానున్న ‘ఐడెంటిటీ’.. ఆకట్టుకుంటున్న టీజర్! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.