
సోషల్ మీడియాలో గిబ్లి ఆర్ట్ (Ghibli Art) ట్రెండ్ శరవేగంగా వైరల్ అవుతోంది. మామూలు ఫోటోలను అనిమేషన్ స్టైల్ పిక్స్‌గా మార్చే ఈ గిబ్లి ఆర్ట్ టెక్నిక్‌కు అందరూ తెగ ఆకర్షితులవుతున్నారు. సామాన్యులు మాత్రమే కాదు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కూడా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఇప్పటికే కీర్తి సురేష్, నిధి అగర్వాల్, మేఘ ఆకాష్ వంటి ప్రముఖ నటీమణులు సోషల్ మీడియాలో గిబ్లి ఆర్ట్ ఫోటోలను షేర్ చేశారు.
తాజాగా టాలీవుడ్ బిజీ హీరోయిన్ నభా నటేష్ కూడా ఈ ట్రెండ్‌లో జాయిన్ అయ్యింది. తన ఫోటోలను గిబ్లి స్టైల్ యానిమేషన్ పిక్స్‌గా మార్చి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో మోడ్రన్, ట్రెడిషనల్ లుక్ మిక్స్ అవ్వడంతో నభా మరింత అందంగా కనిపిస్తోంది. దీంతో ఆమె అభిమానులు ఫోటోలు వైరల్ చేస్తూ, నభా కొత్త లుక్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ప్రస్తుతం నభా నటేష్ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. యంగ్ హీరో నిఖిల్ సరసన నటిస్తున్న స్వయంభు సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. అలాగే సంయుక్త మీనన్ కూడా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. మరోవైపు, డైరెక్టర్ గోపిచంద్ మలినేని – బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ కాంబోలో రాబోతున్న ఓ భారీ ప్రాజెక్టులో నభా నటేష్ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
ఇక వరుస సినిమాలతో టాలీవుడ్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్న నభా, గ్లామర్, పెర్ఫార్మెన్స్ రెండింటిలోనూ దూసుకుపోతోంది. గిబ్లి ఆర్ట్ ఫోటోలతో వైరల్ అవుతున్న నభా, రాబోయే చిత్రాలతో ప్రేక్షకులను ఇంకా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.