స్టార్ హీరోయిన్ త్రిష వరుస విజయాలతో కెరీర్ లో ఫుల్ స్వింగ్ లో ఉంది. ఈ ఏడాది ఆమె నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. మళయాలంలో విడుదలైన “ఐడెంటిటీ” సస్పెన్స్ థ్రిల్లర్ గా విజయం సాధించగా, అజిత్ తో కలిసి నటించిన “విదాముయార్చి” (తెలుగులో “పట్టుదల”) భారీ వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం త్రిష చేతిలో ఆరు పైగా ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “విశ్వంభర” కూడా ఉంది.

 

ఇక సినిమాలతో పాటు త్రిష సోషల్ మీడియా లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. కానీ, ఇటీవల ఆమె ట్విట్టర్ (X) అకౌంట్ హ్యాక్ అయ్యింది. త్రిష అకౌంట్ నుండి క్రిప్టోకరెన్సీ కి సంబంధించిన పోస్టులు వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ మరియు నెటిజన్లు షాక్ అయ్యారు. అయితే, ఈ విషయంలో త్రిష తక్షణమే స్పందించి, “నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. సరిచేస్తున్నాను. ధన్యవాదాలు.” అని ఇన్ స్టాగ్రామ్ ద్వారా స్పష్టం చేసింది.

 

ఇదే తొలిసారి కాదు. గతంలో పెటా (PETA) సంస్థ కార్యకర్తగా ఉన్న సమయంలో కూడా త్రిష సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి. మరోసారి ఇదే తరహా ఘటన చోటు చేసుకోవడంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్రిష ప్రస్తుత సినిమాల జాబితాలో చిరంజీవి విశ్వంభర, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, కమల్ హాసన్ థగ్ లైఫ్, సూర్య 45, మోహన్ లాల్ రామ్ వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *