మన టాలీవుడ్ రౌడీ హీరో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ యూత్ లో ఎలాంటి ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఇప్పుడు ఓ సాలిడ్ హిట్ కోసం తాను ఎదురు చూస్తుండగా టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేస్తున్నాడు. మరి గత సినిమా ఎఫెక్ట్ ఏమాత్రం కనిపించకుండా దీనిపై భారీ హైప్ అయితే నెలకొంది.
ఇక ఈ చిత్రంలో బిజీగా ఉంటూనే లేటెస్ట్ గా తాను ఈ దివాళి కానుకగా రిలీజ్ కి రానున్న “లక్కీ భాస్కర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యాడు. మరి దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా ఈవెంట్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా హాజరయ్యారు.
మరి ఈ ఈవెంట్ లో విజయ్ పై త్రివిక్రమ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. విజయ్ తనకి బాగా నచ్చిన నటుల్లో ఒకడు అని అలాగే చాలా తక్కువ టైం లోనే విజయ్ ఎంత ప్రేమని చూసాడో అంతకు మించిన ద్వేషాన్ని కూడా చేసేసాడు అని వ్యాఖ్యానించారు.
అలాగే దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి కవితలో మా వాడు మహా గట్టివాడు అని ఒకటి ఉంటుంది. ఆయన చెప్పిన ఆ మాట ఈ దేవరకొండ విజయ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అన్నట్టుగా విజయ్ ‘మా వాడు మహా గట్టోడు’ అంటూ తన మార్క్ కామెంట్స్ కి విజయ్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చారు. దీనితో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
The post విజయ్ దేవరకొండపై త్రివిక్రమ్ కామెంట్స్ వైరల్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.