పవన్ కోసం మరో రెండు సినిమాలు రెడీ చేస్తున్న త్రివిక్రమ్..? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 20, 2024 12:21 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు, ఓజి ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాల తరువాత పవన్ దర్శకుడు హరీష్ శంకర్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పూర్తి చేస్తాడు. అయితే, ఇప్పుడు పవన్‌కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కోసం మరో రెండు సినిమాలను రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ‘బ్రో’ సినిమాకు ఆయన పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా అలాంటి పాత్రనే పోషించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పవన్‌కు సూట్ అయ్యే రెండు కథలను విన్నాక, అవి ఆయనకు వినిపించాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ రెండు కథలను పవన్ విని ఓకే అన్నాకే నిర్మాతలు ఎవరనే విషయం తేలనుందట.

మొత్తానికి పవన్ కోసం త్రివిక్రమ్ మరోసారి తీవ్రంగా కష్టపడుతున్నాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి రాజకీయాల్లో బిజీగా ఉంటూ, పవన్ మరో రెండు ప్రాజెక్టులకు ఓకే చెబుతాడా లేడా అనేది చూడాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *