న్యూఢిల్లీ వేదికగా మార్చి 23, 24 తేదీల్లో జరిగిన TV9 నెట్‌వర్క్ ప్రతిష్టాత్మక ‘వాట్ ఇండియా థింక్స్ టుడే (WITT) 2026’ సమ్మిట్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రామారావు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జూపల్లి రామారావు మాట్లాడుతూ.. యువత ప్రతిభే దేశానికి అసలైన బలం అని ఉద్ఘాటించారు. ప్రపంచం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, భారత్ మాత్రం సుమారు ఏడు శాతం వృద్ధిరేటుతో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా దూసుకెళ్తోందన్నారు. దేశ యువ జనాభా, ఆంగ్ల భాషా నైపుణ్యాలు, స్టెమ్ (STEM) రంగాల్లో ప్రతిభ, డిజిటల్ సామర్థ్యం, సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం వంటివి భారత్‌ను ‘గ్లోబల్ టాలెంట్ హబ్’గా నిలబెడుతున్నాయని ఆయన విశ్లేషించారు.
సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. ప్రపంచస్థాయిలో భారత్ ప్రభావం వేగంగా పెరుగుతోందని స్పష్టం చేశారు. ఒకప్పుడు టెక్నాలజీని కేవలం వినియోగించుకునే స్థాయిలో ఉన్న మన దేశం, నేడు ఉత్పత్తిదారుగా ఎదిగిందని ప్రధాని కొనియాడారు. పశ్చిమాసియా సంక్షోభం సహా అంతర్జాతీయ అంశాలపై TV9 నెట్‌వర్క్ అందిస్తున్న కవరేజ్‌ను ఆయన అభినందించారు. వ్యాపార, సాంకేతిక రంగాల ప్రముఖులతో కూడిన ఈ సదస్సు.. భారత్ గ్లోబల్ ప్రయాణంపై చర్చించేందుకు అద్భుతమైన వేదికని మోదీ పేర్కొన్నారు.
The submit TV9 WITT సమ్మిట్ 2026: యువతే దేశానికి అసలైన బలం – జూపల్లి రామారావు first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
