మంచు ఫ్యామిలీ వార్ లో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్నటి నుంచి అనేక వార్తలు మీడియాలో వస్తుండగా దానిపై మంచు ఫ్యామిలీ కూడా తమ స్పందన పీఆర్ టీం ద్వారా తెలియచేస్తోంది. ఇక ఈరోజు ఉదయం కూడా మోహన్ బాబు ఇంటి వద్ద బౌన్సర్ల డ్రామా నడిచింది. ఇక తాజాగా పహాడి షరీఫ్ పోలీసు స్టేషన్ కు వెళ్లిన మంచు మనోజ్ ఫిర్యాదు చేయగా అది మోహన్ బాబు మీదే అని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా పహాడి షరీఫ్ సీఐ గురువా రెడ్డి షాకింగ్ విషయం బయట పెట్టారు. అదేమంటే మంచు మనోజ్ కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయలేదట.. మోహన్ బాబుపై కానీ కుటుంబ సభ్యులపై కానీ మనోజ్ ఫిర్యాదు చేయలేదని అన్నారు.
Manchu Manoj: పోలీస్ స్టేషన్ కి మంచు మనోజ్.. మళ్ళీ తండ్రిపై ఫిర్యాదు
తన ఇంట్లో ఉండగా పదిమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి అరిచారని, తమపై దాడి చేశారు అని ఫిర్యాదు చేశారని వెల్లడించారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేశా కానీ వారు పారిపోయారు నాకు గాయాలు అయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నాకు నా కుటుంబ సభ్యులకు థ్రెట్ ఉంది అని మనోజ్ చెప్పారని అయితే తనపై దాడి చేసిన వారి వివరాలు కూడా చెప్పలేదని అంటున్నారు. మనోజ్ కి ఒక్కరికే గాయాలు అయ్యాయని తెలిపినట్టు సీఐ వెల్లడించారు. అంతేకాక ఘటనా స్థలంలో కిరణ్ రెడ్డి అనే వ్యక్తి సీసీ ఫుటేజ్ కూడా మాయం చేశారు అని ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని మనోజ్ కి చెప్పమని పేర్కొన్న సీఐ నిన్న అసలు డయల్ 100 కి కాల్ రాగానే మేము రెస్పాండ్ అయ్యామని ఘటనా స్థలానికి చేరుకున్నామని వెల్లడించారు.