- యాంకరింగ్ కు చాన్నాళ్లు గుడ్ బై చెప్పిన ఉదయభాను
- ప్రతినిధి 2తో రీఎంట్రీ ఇచ్చిన యాంకర్
- ‘బార్బరీక్’ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా ముద్దుగుమ్మ
Udayabhanu : తెలుగు ఇండస్ట్రీలో స్టార్ యాంకర్లు అంటే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది సుమ. తన తర్వాత ఝాన్సీ, అనసూయ, శ్రీముఖి పేర్లు వినిపిస్తాయి. సుమ ఇప్పటికి స్టార్ యాంకర్ గా కొనసాగుతూనే ఉంది. ఇక ఝాన్సీ బుల్లితెరకి స్వస్తి చెప్పి యాంకర్ గా సెటిల్ అయిపోయింది. అడపాదడపా సినిమాల్లో నటిస్తోంది. ఆ మధ్య వచ్చిన ‘సలార్’ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించింది. ఇక అనసూయ యాంకరింగ్ కి స్వస్తి చెప్పేసి సినిమాలకు పరిమితం అయింది. ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘పుష్ప 2’ సినిమాల తర్వాత అనసూయ నటిగా డేట్స్ ఖాళీ లేనంత బిజీగా నటిగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ఫుల్ టైం యాక్టర్ గానే కొనసాగుతోంది. ఇక సీనియర్ యాంకర్ ఉదయభాను ఒకప్పుడు బుల్లితెరపై చక్రం తిప్పింది. తన అందం, మాటలతో అందరిని అలరించింది. చాన్నాళ్ల తర్వాత కొన్ని షోలు చేస్తూ సందడి చేస్తోంది.
Read Also:Balakrishna Dabidi Dibide: సంవత్సరానికి సరిపడా ట్రోల్ మెటీరియల్.. ఏంట్రా ఇది?
వాస్తవానికి ఉదయభాను నటిగానే కెరీర్ మొదలు పెట్టింది. ఆర్ నారాయణమూర్తి ‘ఎర్ర సైన్యం’ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. తరువాత హిందీలో పౌరాణిక సీరియల్ లో సీత పాత్రలో యాక్ట్ చేసింది. తర్వాత కొన్ని కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే ఏవీ ఆమెకి సక్సెస్ తేలేదు. నిజానికి తను హీరోయిన్ మెటీరియల్.. కాకపోతే సక్సెస్ లు రాకపోవడంతో రేసులో వెనుకబడిపోయింది. ‘లీడర్’, ‘జులాయి’ సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నటించింది. అలాగే 2013లో ‘మధుమతి’ అనే మూవీలో హీరోయిన్ గా ఉదయభాను చేసింది.
Read Also:Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన..? రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌ని మారుస్తున్నారా..?
తరువాత చాలా కాలం బుల్లితెరకి, ఇటు నటనకి దూరమైంది. 2024 నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ చిత్రంలో ఉదయభాను మళ్లీ కనిపించింది. ఈమె ప్రస్తుతం ఓ మూవీలో పవర్ ఫుల్ విలన్ గా కనిపించేందుకు రెడీ అవుతుందట. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్న ‘బార్బరిక్’ అనే మూవీ రెడీ అయ్యింది. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఉదయభాను విలన్ గా కనిపించబోతోందంట. తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన మహారాజ స్టైల్ లో అదిరిపోయే ట్విస్ట్ లతో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ ‘బార్బరీక్’ సినిమా ఉండబోతుందన్న టాక్ వినిపిస్తుంది.మరి ఈ సినిమా ఆమెకి నటిగా కమర్షియల్ బ్రేక్ ఇచ్చి టాలీవుడ్ స్టార్ యాక్టర్ ని చేస్తుందేమో చూడాలి.