‘ఉగ్రావతారం’ అందరినీ ఆకట్టుకుంటుంది – ప్రియాంక ఉపేంద్ర | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 15, 2024 9:36 AM IST

ఎస్‌జీఎస్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియాంక ఉపేంద్ర సమర్పణలో ఎస్.జి.సతీష్ నిర్మాతగా గురుమూర్తి దర్శకత్వంలో రాబోతోన్న చిత్రం ‘ఉగ్రావతారం’. ఈ చిత్రంలో ప్రియాంక ఉపేంద్ర లీడ్ రోల్‌లో నటించారు. సుమన్, నటరాజ్ పేరి, అజయ్, పవిత్రా లోకేష్, సాయి ధీనా, సుధి కాక్రోచ్, లక్ష్య శెట్టి వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్, ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు, నటుడు సత్య ప్రకాష్, నిర్మాత రాజ్ కందుకూరి సందడి చేశారు.

ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘ఉగ్రావతారం వంటి కంటెంట్ దసరాకి రావాల్సిన సినిమా. ఫీమేల్ ఓరియెంటెడ్‌గా తీసిన ఈ చిత్రం దసరాకి వస్తే ఇంకా బాగుండేది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వాటిని చూపిస్తూ తీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. గురుమూర్తి ఇది వరకు తీసిన చిత్రాలు కూడా బాగుంటాయి. నవంబర్ 1న రాబోతోన్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. ప్రియాంక ఉపేంద్రకు మంచి సక్సెస్ రావాలి. ఇలాంటి చిత్రాలను మీడియా ముందుండి నడిపించాలి’ అని అన్నారు.

ప్రియాంక ఉపేంద్ర మాట్లాడుతూ.. ‘నాకు హైద్రాబాద్‌తో ఎంతో అనుబంధం ఉంది. ఉపేంద్ర గారిని ఫస్ట్ టైం ఇక్కడే కలిశాను. హైద్రాబాద్ నాకు చాలా లక్కీ సిటీ. నా కెరిర్‌లో ఇదే ఫస్ట్ యాక్షన్ ఫిల్మ్. గురుమూర్తి గారి వల్లే ఈ మూవీని చేశాను. నేను ఈ పాత్రకు సెట్ అవుతాను అని ఆయనే నమ్మారు. నవంబర్ 1న మా చిత్రం రాబోతోంది. నా మొదటి పాన్ ఇండియన్ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.

గురుమూర్తి మాట్లాడుతూ.. ‘సమాజంలో జరిగే అన్యాయాల్ని, అఘాయిత్యాల్ని మీడియా ప్రశ్నించి ఎదురించగలదు. మా ఈ చిత్రాన్ని అటువంటి సమస్యల మీదే తీశాను. మంచి సందేశాత్మాక చిత్రంగా ఉంటుంది. ప్రియాంక మేడం కొత్త పాత్రలో కనిపించబోతున్నారు. నటరాజ్ అద్భుతంగా నటించాడు. నవంబర్ 1న రానున్న మా చిత్రాన్ని అందరూ చూడండి’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని వారు తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *