ప్రస్తుతానికి ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజి అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ చీలమండ వద్ద గాయం కావడంతో డాక్టర్లు సూచనలు మేరకు ఆయన షూటింగ్ కి బ్రేకులు వేశారు. గాయం కారణంగా కల్కి జపాన్ ప్రమోషన్స్ కి కూడా ఆయన డుమ్మా కొట్టారు. ఈ సినిమా జనవరి మూడో తేదీన జపాన్ లో రిలీజ్ అవబోతుంది. అయితే వచ్చే నెల మొదటి వారంలో ఫౌజి షూటింగ్ మళ్లీ మొదలు కానుంది. అయితే ప్రభాస్ మాత్రం ఇప్పట్లో పాల్గొనడం లేదని తెలుస్తోంది. ఆయన మరికొన్ని రోజులు రెస్ట్ తీసుకోబోతున్నారు. ఇది స్వాతంత్రానికి ముందు జరిగే ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ కోసం పలు భారీ బడ్జెట్ తో కూడిన సెట్స్ నిర్మించారు.
Pushpa 2: హిందీలో తగ్గేదేలే.. మరో రికార్డుకు చేరువలో పుష్ప రాజ్
రామోజీ ఫిలిం సిటీ లో ఒక భారీ జైల్ సెట్ కూడా నిర్మించారు. అక్కడే ఒక కీలకమైన షెడ్యూలు కూడా జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకి సంబంధించిన కొంత షూటింగ్ భాగం కలకత్తాలో చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇప్పటికీ కలకత్తాలో ఎన్నో పురాతన భవనాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పీరియాడిక్ సినిమాకి ఆ సిటీ కరెక్టుగా సెట్ అవుతుంది. దీంతో వచ్చే సమ్మర్లో అక్కడ షూట్ చేయడం కోసం ఏ భగవంతుడు బాగుంటాయో హనూ రాఘవపూడి అండ్ టీం ప్రస్తుతానికి సెర్చ్ చేస్తోంది. ఒక రకంగా లైవ్ లొకేషన్స్ లో ఈ సినిమా షూట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాస్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుంటే ఇలా లైవ్ లొకేషన్స్ లో షూట్ చేయడం అనేది చాలా రిస్క్ తో కూడిన వ్యవహారం. అయినా ఆయా భవనాల సెట్స్ ను సిద్ధం చేయడం కంటే భారీ సెక్యూరిటీతో అక్కడే షూట్ చేయడం బెటర్ అని భావిస్తున్నట్టు తెలుస్తోంది.