MARCO : రూ. 100 కోట్ల క్లబ్ లో ఉన్ని ముకుందన్ ‘మార్కో’

 2024లో చిన్న సినిమాలతో మెరుపులు మెరిపించిన ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది మలయాళ చిత్ర పరిశ్రమే. ఇయర్ స్టాటింగ్ నుండి ఎండింగ్ వరకు నాన్ స్టాపబుల్‌గా ఎంటర్ టైన్ చేసింది.ఇటీవల విడుదలైన ఓ మలయాళ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా దడదడలాడిస్తుంది. మాలీవుడ్ రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘మార్కో’ మలయాళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లోను అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకెళుతుంది. గత ఏడాది డిసెంబర్ 20న మలయాళంలో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఓవర్ వయలెన్స్, తీవ్రమైన రక్తపాతం వంటి విమర్శలు వచ్చినప్పటికీ  సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను ఎగబడి మరి చూస్తున్నారు.   సినిమాతో పాన్ ఇండియన్ హీరోగా అవతరించాడు ఉన్ని ముకుందన్.

జనతా గ్యారేజ్, భాగమతి వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి తెలుగులోనూ మంచి పేరున్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఉన్ని ముకుందన్. కానీ కెరీర్ సాఫీగా సాగిపోతున్న సమయంలో లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొని విమర్శల పాలయ్యాడు. కానీ ఇది తన కెరీర్ ను ఆపలేకపోయింది. ఆ తర్వాత బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నాడు. మెప్పాడియన్, మాలికాపురంతో ఉన్నిముకుందన్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఇప్పుడు మార్కోతో స్టార్ హీరోగా మారాడు ఉన్ని. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ రూ. 100 కోట్ల మార్క్ ను దాటిసింది. సౌత్ నుండి ఒక్కొక్కరుగా పాన్ ఇండియన్ హీరోలుగా మారుతున్న టైంలో ఈ జాబితాలోకి రీసెంట్లీ ఎంటరయ్యాడు ఉన్ని ముకుందన్. నార్త్‌లో మార్క్ కు పెరుగుతున్న క్రేజ్, ఉన్ని ఇమేజ్ యష్ ను తలపిస్తుంది.   ఇప్పుడు మార్కోతో ఉన్ని ఐడెంటిటీ కూడా పూర్తిగా మారబోతున్నట్లే  కనిపిస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *