Published on Dec 15, 2024 6:22 PM IST
‘మెగా పవర్ స్టార్ రామ్ చరణ్’ సతీమణి ఉపాసన తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తరచూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఉపాసన సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను షేర్ చేసుకున్నారు. గౌరవ, మర్యాదలతో ఇతరులకు వైద్యం అందించడమే నిజమైన సనాతన ధర్మమని తన తాతయ్య తమకు చెప్పినట్లు ఉపాసన తన పోస్ట్ లో చెప్పుకొచ్చారు.
కాగా తన పోస్టులో ఉపాసన ఏం చెప్పారంటే.. ‘అవసరమైన వారికి సానుభూతి, గౌరవంతో వైద్యాన్ని అందించడమే నిజమైన సనాతన ధర్మం అని మాకు మాకు మా తాతయ్యగారు నేర్పించారు. ఆయన మాటల నుంచి స్ఫూర్తి పొందిన మేము.. అయోధ్య రామ మందిరం వద్ద అపోలో ఉచిత ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. తిరుమల, శ్రీశైలం, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లలో విజయవంతంగా ఈ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఇప్పుడు రామ జన్మభూమిలో దీనిని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ విషయంలో మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు’ అంటూ ఉపాసన తన పోస్ట్ లో అని పేర్కొన్నారు.