
తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ అనన్య నాగళ్ల 1996 జనవరి 8న తెలంగాణలోని సత్తుపల్లిలో జన్మించింది. తండ్రి వెంకటేశ్వరరావు, తల్లి విష్ణు ప్రియా. ఇబ్రహీంపట్నంలోని రాజ మహేంద్ర ఇంజినీరింగ్ కాలేజ్ లో బి.టెక్ పూర్తి చేసి, కొంతకాలం ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేసింది. అయితే, సినిమాలపై ఆసక్తితో టెక్నాలజీ ఫీల్డ్ ని వదిలి సినీ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
2019లో వచ్చిన మల్లేశం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన అనన్య, 2021లో ప్లేబ్యాక్ అనే సైన్స్ ఫిక్షన్ మూవీలో నటించింది. అదే ఏడాది పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ లో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆ తర్వాత నితిన్, నభా నటేష్ జంటగా వచ్చిన మాస్ట్రో సినిమాలో కూడా నటించి మెప్పించింది.
2023లో సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమాలో అనసూయ గా కనిపించింది. అదే ఏడాది మళ్లీ పెళ్లి, అన్వేషి చిత్రాల్లో నటించింది. 2024లో తంత్ర అనే హార్రర్ థ్రిల్లర్, డార్లింగ్ వై దిస్ కలవరి వంటి సినిమాల్లో నటించింది. అయితే పొట్టెల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడం విశేషం. అదే ఏడాది శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే చిత్రంలో కూడా కీలక పాత్ర పోషించింది.
కేవలం సినిమాలే కాకుండా, షార్ట్ ఫిల్మ్స్ & వెబ్ సిరీస్ లోనూ నటించిన అనన్య, షాది అనే షార్ట్ ఫిల్మ్ లో నటించి SIIMA అవార్డ్ అందుకుంది. 2024లో Zee5 లో వచ్చిన బహిష్కరణ వెబ్ సిరీస్ లో కూడా మెప్పించింది. ప్రస్తుతం అనన్య పలు సినిమాలు & వెబ్ సిరీస్ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉంది.