UiTheMovie : యుఐ సినిమాతో ‘ఉపేంద్ర’ హిట్ కొడతాడా

భారతీయ సినీ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా ఉపేంద్రకు మంచి గుర్తింపు ఉంది. 90లలో ఉన్న ఉపేంద్ర సినిమాల చేసిన హంగామా అంతా ఇంతా కాదు.కన్యాదానం, రా, ఎ, ఉపేంద్ర, రక్త కన్నీరు వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాయి. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేయడం ఉపేంద్ర స్టైల్. అప్పట్లో ఉపేంద్ర సినిమా అంటే కర్నాటకలో థియేటర్స్ వద్ద జాతరను తలిపించే వాతావరణం ఉండేది.

కానీ గత కొన్నేళ్లుగా సొంత దర్శకత్వానికి గ్యాప్ ఇచ్చి కేవలం హీరోగా మాత్రేమే ఉపేంద్ర సినిమాలు చేస్తున్నాడు. గతేడాది కబ్జా సినిమాతో ఆడియెన్స్ ను పలరించాడు. అయితే ఎన్నో ఏళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న ఉపేంద్ర ఇటీవల మరోసారి మెగాఫోన్ పట్టాడు. ఆయన స్వీయ దర్శకత్వంలో ‘యూఐ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ డిసెంబరు 20న వరల్డ్ వైడ్ గా ఈ సిమిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ లో టాలీవుడ్ ఆడియెన్స్ తో ముచ్చటిస్తూ ‘యూఐ’ సినిమాతో సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాం అని, ఈ సినిమా క్లైమాక్స్ సైతం మీరు ఊహించిన దానికంటే కొత్తగా ఉంటుంది అని అన్నారు. కన్నడ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాల సృష్టిస్తున్న నేపథ్యంలో ‘యూఐ’ సినిమా ఎంతమేర కలెక్షన్లను సాధిస్తుందోనని ట్రేడ్ గమనిస్తోంది. ‘యుఐ’ డబ్బింగ్ మూవీ అయినప్పటికీ టాలీవుడ్ లో ఉపేంద్ర సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండటంతో ఈ సినిమా బుకింగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాతో మరోసారి వింటేజ్ ఉపేంద్ర దర్శకత్వాన్ని చూస్తారని ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *