
ఊర్మిళ మటోండ్కర్.. 90’s లో బాలీవుడ్‌ను తన అందం, అభినయంతో శాసించిన హీరోయిన్. ‘రంగీలా’, ‘సత్య’, ‘భూత్’ వంటి హిట్ సినిమాలతో టాప్ హీరోయిన్ గా వెలిగింది. అయితే, కెరీర్ టాప్‌లో ఉన్న సమయంలోనే ఊర్మిళ అకస్మాత్తుగా సినిమాలకు దూరమైంది.
ఆమె పెళ్లైన వ్యక్తిని ప్రేమించిందనే వార్తలు ప్రచారంలోకి రావడంతో ఊర్మిళ కెరీర్‌పై ప్రభావం పడింది. ఆ సమయంలో ఆమెకు కొత్త ప్రాజెక్ట్స్ తగ్గిపోయాయి. చివరకు, 2016లో కాశ్మీరీ మోడల్, నటుడు మొహ్సిన్ అక్తర్ మీర్ ను వివాహం చేసుకుంది. వారిద్దరి మధ్య 10 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉండటం కూడా అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. మొహ్సిన్ ‘లక్ బై ఛాన్స్’, ‘ముంబై మస్త్ కలందర్’ వంటి చిత్రాల్లో నటించాడు.
అయితే, ఇటీవల ఊర్మిళ-మొహ్సిన్ విడాకుల గురించి రూమర్స్ వైరల్ అయ్యాయి. ఊర్మిళ తన సోషల్ మీడియాలో మొహ్సిన్‌ను అన్‌ఫాలో చేయడం ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే, ఇద్దరూ ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు.
కెరీర్‌ని పీక్ స్టేజ్‌లో వదిలేసి, వ్యక్తిగత జీవితాన్ని ఎంచుకున్న ఊర్మిళ మటోండ్కర్.. ఇప్పుడు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటోంది. ఆమె సినిమాలకు రీఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది మాత్రం సందేహాస్పదంగా మారింది.