
భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ కేవలం క్రికెట్ అభిమానులకే కాదు, సినీ ప్రపంచానికి కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, నారా లోకేష్, దర్శకుడు సుకుమార్ కూడా హాజరయ్యారు. అయితే, మ్యాచ్ కంటే ఎక్కువగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేల (Urvashi Rautela) పుట్టిన రోజు వేడుకలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.
ఫిబ్రవరి 25న ఊర్వశీ పుట్టినరోజు అయినా, దుబాయ్ క్రికెట్ స్టేడియం సిబ్బంది ముందుగా ఆమెకు సర్ప్రైజ్ కేక్ గిఫ్ట్ ఇచ్చారు. స్టేడియం నిండా క్రికెట్ అభిమానుల సమక్షంలో భారత్, పాక్ ఆటగాళ్ల మధ్య ఊర్వశీ తన బర్త్‌డేను గ్రాండ్‌గా జరుపుకుంది. ఇంతటి ప్రత్యేకమైన సందర్భాన్ని మొట్టమొదటి సారి సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్‌గా ఊర్వశీ రికార్డ్ క్రియేట్ చేసింది.
ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఊర్వశీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లోనూ స్టేడియంలో బర్త్‌డే సెలబ్రేట్ చేసిన ఫోటోలు షేర్ చేసింది. క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ఈ విశేషాన్ని ఆసక్తిగా ఆస్వాదిస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, భారత జట్టు పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీలో అదిరిపోయే స్టార్ట్ ఇచ్చింది. ఊర్వశీ బర్త్‌డే, ఇండియా విజయం – రెండూ కలిపి దుబాయ్‌లో డబుల్ సెలబ్రేషన్ గా మారాయి.