అమెజాన్ ప్రైమ్‌లో ‘ఉత్సవం’ చిత్రానికి మంచి రెస్పాన్స్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 12, 2024 8:15 AM IST

దసరా సందర్భంగా థియేటర్లో, ఓటీటీలో కొత్త చిత్రాల సందడి కనిపిస్తోంది. ఈ క్రమంలో రీసెంట్‌గా వచ్చిన ఎమోషనల్ డ్రామా, సందేశాత్మక చిత్రం ‘ఉత్సవం’ ఓటీటీలోకి వచ్చింది. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మానందం, ఆలీ, ప్రేమ, ఎల్బీ శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధా తదితరులు నటించగా సురేష్ పాటిల్ నిర్మించిన ఈ చిత్రానికి అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత నెలలో థియేటర్లోకి వచ్చి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.

అంతరించి పోతోన్న నాటక రంగం గురించి, వాటితో ముడిపడి ఉన్న ఎమోషన్స్‌ను, నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా కథనంతో అద్భుతంగా చూపించారు. ఎమోషనల్, యూత్‌ఫుల్ లవ్ డ్రామాగా వచ్చిన ఉత్సవం అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. దసరా సందర్భంగా అక్టోబర్ 11న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *