ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ థ్రిల్లర్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings


సౌత్ వెర్సటైల్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఎన్నో సినిమాల్లో విలక్షణ పాత్రలు చేసిన సంగతి తెలిసిందే. తెలుగు సహా తమిళ్ లో అయితే లేడీ విలన్ రోల్స్ కి ఆమెనే బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తారు. అలాగే వీటితో పాటుగా పలు ఎమోషనల్ పాత్రలు కూడా చెయ్యగలరు అని రీసెంట్ హను మాన్ తో చూపించగా ఈ సినిమా తర్వాత తన నుంచి సోలోగా వచ్చిన పాన్ ఇండియా చిత్రమే “శబరి”.

దర్శకుడు అనిల్ కాట్జ్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాదిలో మే లో వచ్చింది. కానీ అనుకున్న రేంజ్ సక్సెస్ కాలేకపోయింది. మరి అప్పుడు నుంచి ఈ సినిమా ఏ ఓటీటీ లో కూడా రాలేదు. కానీ ఫైనల్ గా నేటి నుంచి సౌత్ స్ట్రీమింగ్ యాప్ సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతుంది. పాన్ ఇండియా భాషల్లో వచ్చిన ఈ సినిమా ఈరోజు నుంచి సన్ నెక్స్ట్ లో కూడా పాన్ ఇండియా భాషల్లోనే స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ థ్రిల్లర్ సినిమా చూడాలి అనుకునే వారు సన్ నెక్స్ట్ లో చూడొచ్చు.

The post ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ థ్రిల్లర్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *