Published on Oct 18, 2024 3:00 PM IST
తన టాలెంట్ తో సౌత్ లో తమిళ్ సహా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటీనటుల్లో టాలెంటెడ్ వెర్సటైల్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒకరు. మరి డిఫరెంట్ ట్రాక్ లో విలన్ రోల్స్ చేస్తూ టాలీవుడ్ లో కూడా సాలిడ్ హిట్స్ అందుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ తానే ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ థ్రిల్లర్ చిత్రం “శబరి” తో వచ్చిన ఈ చిత్రాన్ని దర్శకుడు అనీల్ కాట్జ్ దర్శకత్వం వహించారు.
అయితే పాన్ ఇండియా భాషల్లో ప్లాన్ చేసిన ఈ సినిమా అనుకున్న అంచనాలు రీచ్ కాలేకపోయింది. ఇలా డిజప్పాయింట్ చేసిన ఈ సినిమా రీసెంట్ గానే ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చింది. మొదటిగా పాన్ ఇండియా భాషల్లో సన్ నెక్స్ట్ లో వచ్చిన ఈ చిత్రం నేటి నుంచి మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా లో తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ థ్రిల్లర్ ని చూడాలి అనుకునేవారు ఆహా లో కూడా ట్రై చేయవచ్చు.
A mother’s unstoppable love protects her daughter from danger.
Watch #Sabari on aha ! ▶️ https://t.co/lYwIOZuIpf pic.twitter.com/LtXJ7IAiLq
— ahavideoin (@ahavideoIN) October 18, 2024