Varun Sandesh : మరోసారి డిఫరెంట్ కథతో వస్తున్న వరుణ్ సందేశ్.. ఈ సారైనా హిట్ కొట్టేనా ?

Varun Sandesh : ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలతో బిజీగా ఉంటున్నాడు హ్యాపీడేస్ ఫేమ్ వరుణ్ సందేశ్. ఈ యంగ్ హీరోకు ఇటీవల కాలంలో కెరీర్ కు సరిపడా హిట్ పడలేదు. ఆ మధ్య ఆయన నటించిన థ్రిల్లర్ మూవీ విరాజీ. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కథనం పరంగా బాగానే ఉన్నా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వరుణ్ తేజ్ హిట్ కొట్టి చాలా కాలం అయింది. అయినా కూడా ఆయనకు వరుస అవకాశాలు రావడం ఆశ్చర్యకరం.

Read Also:Ramesh Bidhuri: నేను ఎమ్మెల్యేగా గెలిస్తే.. కల్కాజీ రోడ్లను ప్రియాంక బుగ్గల్లా తయారు చేస్తా..

హ్యాపీడేస్ తర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టిన సినిమా లేదు. మధ్యలో వచ్చిన కొత్త బంగారు లోకం ఫర్వా లేదనిపించినా.. సరైన హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ హీరో ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘కానిస్టేబుల్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ఆర్యన్ సుభాన్ డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.

Read Also:OYO: పెళ్లికాని జంటలకు ఓయో బిగ్ షాక్.. కొత్త రూల్స్తో వారికి చెక్

పక్కా క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. హత్యలు చేస్తున్న కిరాతకుడిని వెంటాడే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో వరుణ్ సందేశ్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను మేకర్స్ ఆసక్తికరమైన ట్విస్టులతో తెరకెక్కించినట్లు ఇప్పటికే వెల్లడించారు. మరి ఈ సీరియల్ కిల్లర్‌ని కానిస్టేబుల్ పట్టుకున్నాడా లేదా అనేది సినిమాలో చూపెట్టబోతున్నారట. ఇక ఈ సినిమాలో మధులిక వారణాసి హీరోయిన్‌గా నటిస్తుంది. సుభాష్ ఆనంద్, గ్యానీ సంగీతం అందించిన ఈ సినిమాను బలగం జగదీశ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *