మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల భామ లావణ్య త్రిపాఠి గతేడాది ప్రేమవివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తమ ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించడంతో వారి పెళ్లి ఘనంగా జరిగింది. అయితే, వారి పెళ్లయ్యి అప్పుడే ఏడాది అవుతోంది. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు.
తన భార్యకు తొలి యానివర్సరీ విషెస్ చెబుతూ ఓ రొమాంటిక్ ఫోటోను పోస్ట్ చేశాడు వరుణ్. ఇటీవల వారు స్విట్జర్లాండ్ వెకేషన్‌కు వెళ్లినప్పుడు దిగిన ఓ ఫోటోను వరుణ్ ఈ సందర్భంగా పోస్ట్ చేశాడు. మెగా కపుల్‌గా ఈ జోడీ అందరి మన్ననలు అందుకుంటోంది.
ఇక వరుణ్ తేజ్, లావణ్య ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు విషెస్ చెబుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, వరుణ్ తేజ్ ‘మట్కా’ సినిమాతో ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.
The post లావణ్యకు వరుణ్ తేజ్ రొమాంటిక్ యానివర్సరీ విషెస్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.