విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతోంది. విజయ్ నటిస్తున్న 12వ సినిమా ఇది. వీడీ 12 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా ఫ్యామిలీ స్టార్ కోసం కొంత గ్యాప్ తీసుకున్నారు. తాజాగా షూటింగ్ రీస్టార్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వీడీ 12 కొత్త షెడ్యూల్ బిగిన్ చేశారట. మొదట భారీ యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను వంద కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. గతంలో శ్రీలీలతో ఈ సినిమా స్టార్ట్ చేయగా..ఇప్పుడు ఆమెనే కొనసాగిస్తారా లేక ఎవరైనా కొత్త నాయికకు ఛాన్స్ ఇస్తారా అనేది మూవీ టీమ్ వెల్లడించాల్సిఉంది.