‘వీక్షణం’ ఎవరి ఊహలకు అందని మూవీ – హీరో రామ్ కార్తీక్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 15, 2024 8:26 AM IST

రామ్ కార్తీక్, క‌శ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “వీక్షణం”. ఈ చిత్రాన్ని ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మ‌నోజ్ ప‌ల్లేటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “వీక్షణం” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను హీరో రామ్ కార్తీక్ మీడియాతో పంచుకున్నాడు.

డైరెక్టర్ మనోజ్ పల్లేటి “వీక్షణం” మూవీ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆసక్తికరంగా అనిపించింది. “వీక్షణం” సినిమాలో సరదాగా ఉండే కుర్రాడిలా కనిపిస్తా. అతనికి పక్కవాడి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. తనకున్న ఈ మనస్తత్వం వల్ల అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది మూవీలో మెయిన్ పాయింట్. “వీక్షణం” సినిమా లవ్ స్టోరీతో స్టార్ట్ అయ్యి మిస్టరీ థ్రిల్లర్ గా మారుతుంది.

“వీక్షణం” సినిమా డైరెక్టర్ మనోజ్ కొత్త వారు కాబట్టి ప్రాజెక్ట్ సెట్ చేసేందుకు మొదట్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. మా ప్రొడ్యూసర్ అశోక్ గారు మనోజ్ ఒకే ఊరివారు కావడంతో కథ నచ్చి వెంటనే మూవీ స్టార్ట్ చేశారు. స్క్రీన్ ప్లేలో హుక్ పాయింట్స్ ఉండేలా దర్శకుడు చూసుకున్నారు. మా మూవీలో ప్రీ క్లైమాక్స్ ను ఎవరూ ఊహించలేరు. మా మూవీకి బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు డీవోపీ సాయి రామ్. సమర్థ్ మంచి మ్యూజిక్ చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *