రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “వీక్షణం”. ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి.పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మనోజ్ పల్లేటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “వీక్షణం” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శకుడు మనోజ్ పల్లేటి, సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి మీడియాతో పంచుకున్నారు.
దర్శకుడు మనోజ్ పల్లేటి మాట్లాడుతూ.. ‘నేను రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో డీఎఫ్ టీ కోర్స్ చేశాను. ఒకరోజు విక్టరీ వెంకటేష్ గారు ఒక మాట చెప్పారు. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటంటే మన పని మనం చూసుకోవడం అని ఆయన అన్నారు. వెంకటేష్ గారు చెప్పిన ఆ మాటే ఈ సినిమా లైన్ కు మూలం. అక్కడి నుంచి వీక్షణం సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటూ వచ్చాం. మాది తాడిపత్రి. ఊరికి వెళ్లి ప్రొడక్షన్ గురించి ట్రై చేద్దామని అనుకున్నాను. అలా పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి, మేము కలిసి ఈ మూవీ స్టార్ట్ చేశాం. గతంలో జార్జ్ రెడ్డి, జోహార్ వంటి చిత్రాలకు పనిచేశాను. వీక్షణం సినిమా మేకింగ్ టైమ్ లో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. మా టీమ్ అంతా ప్రతి ఒక్కరం ఈ సినిమా కోసం కష్టపడి పనిచేయలేదు ఇష్టపడి పనిచేశాం. సంగీత దర్శకుడు సమర్థ్ మూవీ మూడ్‌ను తన మ్యూజిక్‌తో బాగా క్యారీ అయ్యేలా చేశారు. మా సినిమాలో సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అయితే అవి ఎవరినీ ఇబ్బంది పెట్టేలా ఉండవు. థ్రిల్లర్స్ అనేవి యూనివర్సల్ కాన్సెప్ట్స్. వీక్షణం లాంటి సినిమాలను భాషలకు అతీతంగా ఎవరైనా చూసి ఎంజాయ్ చేయొచ్చు.’ అని అన్నారు.
సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి మాట్లాడుతూ.. ‘నేను సంగీత దర్శకుడు కోటి గారి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడే ఎంఎస్ రాజు గారి దగ్గర నుంచి ఆఫర్ వచ్చింది. ఆయన డైరెక్ట్ చేసిన ‘‘7 డేస్, 6 నైట్స్’’ అనే మూవీకి మ్యూజిక్ చేశాను. వీక్షణం సంగీత దర్శకుడిగా నాకు రెండో సినిమా. ఈ సినిమాలో కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్, మిస్టరీ, లవ్, రొమాన్స్ వంటి అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో 3 సాంగ్స్ ఉంటాయి. ఈ కథ దర్శకుడు చెప్పగానే చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఈ నెల 18న థియేటర్స్ లో మా మూవీ చూసి సపోర్ట్ చేయండి.’ అని అన్నారు.
The post “వీక్షణం”.. సరికొత్త మిస్టరీ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.