ఆ కథ రజనీకాంత్‌ కి చెప్పాను – వెంకట్ ప్రభు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 22, 2024 7:55 PM IST

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఇటీవలే తలపతి విజయ్‌తో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (ది గోట్) చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విజయ్ అభిమానులను అలరించినప్పటికీ, మిగిలిన అభిమాన వర్గాలను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఐతే, రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, వెంకట్ ప్రభు తాను మొదట సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఈ ‘ది గోట్‌’ సినిమాను చేయాలని ప్లాన్ చేసినట్టు చెప్పుకొచ్చారు.

పైగా రజనీకాంత్‌కి కథ నచ్చినా, తాను విభిన్నమైన కథనాన్ని కూడా ఆయన కోసం రాసినట్టు వెంకట్ ప్రభు చెప్పారు. అయితే, ఆ సమయంలో తాను డ్యూయల్ రోల్ కాన్సెప్ట్‌ను డిజైన్ చేయలేదు అని, కొడుకు పాత్ర కోసం ధనుష్‌ని దృష్టిలో పెట్టుకుని, రజనికి కథను చెప్పాను అని వెంకట్ ప్రభు తెలిపారు. చివరికి, ఈ ప్రాజెక్ట్ రజనీకాంత్‌తో కుదరలేదు అని, విజయ్ హీరోగా కొత్త వెర్షన్‌తో ది గోట్ ;ప్రేక్షకుల ముందుకు వచ్చింది అని వెంకట్ ప్రభు క్లారిటీ ఇచ్చారు. మరి రజని ఈ సినిమాని చేసి ఉంటే మూవీ ఏ రేంజ్ లో హిట్ అయ్యేదో !!.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *