• ఆల్బమ్ తో మళ్ళి వస్తున్న జయతి
  • లచ్చి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ
  • డుగ్గు డుగ్గు బుల్లెట్ బండి ఆల్బమ్ తో హల్ చల్

తెలుగు ప్రేక్షకులకు జయతి పేరు ఇప్పటి యూత్ కు అంతగా తెలియదేమో కాని ఒకప్పుట్లో జయతి అంటే ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఒకప్పుడు జెమినీ మ్యూజిక్ లో వెన్నెల అనే షో ద్వారా వీడియో జాకీగా అలరించిన జయతికి అప్పట్లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. విపరీతమైన ఫాలోయింగ్ ఉండటం మాత్రమే కాదు, ఆంధ్ర మాధురి దీక్షిత్ లా ఉంది అంటూ ఆమె అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉండేవారు. ఇక వీడియో జాకీగా పనిచేసిన తర్వాత ఆ అమ్మడు సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అది కూడా నిర్మాతగా.

తన సొంత నిర్మాణ సంస్థలో, లచ్చి అనే హారర్ కామెడీ జానర్ సినిమాను నిర్మిస్తూ అదే సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది. ఆ అనంతరం కాస్త గ్యాప్ తీసుకున్న ఆమె ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ నటనకు మళ్లీ దగ్గరవుతోంది. తాజాగా డుగ్గు డుగ్గు బుల్లెట్ బండి అనే ఒక ఆల్బమ్ సాంగ్ తో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టు అందుకుంది. నివృతి వైబ్స్ యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ అయిన ఈ సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. తాజాగా రిలీజ్ అయిన ఈ పాట ఏకంగా 2 మిలియన్ వ్యూస్ దక్కించుకోవడం గమనార్హం. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ ఫోక్ సాంగ్ లో జయతి తనదైన శైలిలో డాన్స్ లతో ఆకట్టుకుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *