“విడుదల 2″కి భారీ రన్ టైం.. తెలుగులో వర్క్ అవుతుందా!? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 21, 2024 1:09 AM IST

తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ మూవీ ‘విడుదల 2’ థియేటర్లలో సందడి చేస్తోంది. తమిళ్ సెన్సేషనల్ డైరెక్టర్ వెట్రిమారన్ కథ అందించిన ఈ సినిమాకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ నెలకొంది. గతంలో వచ్చిన ‘విడుదల పార్ట్ 1’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కావడంతో, ఇప్పుడు ‘విడుదల పార్ట్ 2’పై మంచి బజ్ ఏర్పడింది.

థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీకి మిక్సిడ్ టాక్ లభిస్తుంది. అయితే, ఈ సినిమా తరువాత ‘విడుదల పార్ట్ 3’ కూడా ఉంటుందా అనే ప్రశ్న ప్రేక్షకుల్లో నెలకొని ఉండగా.. తాజాగా విడుదల 2తో ఈ ప్రశ్నకు సమాధానం లభించిందని చెప్పాలి. హీరో పాత్ర నక్సలైట్‌గా మారడానికి గల కారణాలను వెట్రిమారన్ ‘విడుదల 2’లో చూపెట్టిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు అందరూ ఊహించినట్లుగానే వెట్రిమారన్ నార్మల్ క్లైమాక్స్‌తో ముగించేశాడు.

దీంతో ‘విడుదల 3’పై నెలకొన్న ప్రశ్నలకు ఆయన ఈ సినిమాతో చెక్ పెట్టినట్లు చెప్పాలి. ‘విడుదల 3’ ఉంటుందా లేదా అనే విషయంపై వెట్రిమారన్ చాలా క్లియర్‌గా ఈ సినిమాతో సమాధానం చెప్పాడని అభిమానులు చెబుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *