‘గగన మార్గన్’ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతున్న విజయ్ ఆంటోని | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

తమిళ నటుడు విజయ్ ఆంటోని నటించే సినిమాలను ఇతర భాషల్లోనూ రిలీజ్ చేస్తుంటారు. ఇక ఈ హీరో వరుసగా సినిమాలను వేగంగా పూర్తి చేస్తూ రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. విజయ్ ఆంటోని తన నెక్స్ట్ మూవీపై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ని ఇచ్చాడు.

తన నెక్స్ట్ మూవీ ఓ క్రైమ్ థ్రిల్లర్‌గా ఉండబోతుందని.. ఈ సినిమా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునేలా ఎగ్జైటింగ్‌గా ఉండబోతుందని విజయ్ ఆంటోని చెబుతున్నాడు. ఇక ఈ సినిమాకు ‘గగన మార్గన్’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేయగా, తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రముఖ ఎడిటర్ లియో జాన్ పాల్ ఈ సినిమాతో డైరెక్టర్‌గా మారుతున్నాడు.

విజయ్ ఆంటోని సొంత బ్యానర్ విజయ్ ఆంటోని ఫిల్మ్స్ కార్పొరేషన్ నుంచి వస్తున్న 12వ చిత్రంగా ‘గగన మార్గన్’ నిలవనుంది. విజయ్ ఆంటోని సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సముధ్రఖని, ప్రితిక, బ్రిగిడ సాగా, వినోద్ సాగర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

The post ‘గగన మార్గన్’ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతున్న విజయ్ ఆంటోని first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *