సాంగ్ కోసం ‘విజయ్ దేవరకొండ’ రిహార్సల్స్ ! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే.. జనవరి ఫస్ట్ వీక్ లో ఈ సినిమాలోని ఓ ముఖ్యమైన సాంగ్ ను షూట్ చేయబోతున్నారు. అందుకోసం విజయ్ దేవరకొండ ప్రస్తుతం రిహార్సల్స్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ 80 % పూర్తి అయింది.

రెండు కీలక సన్నివేశాలతో పాటు మరో సాంగ్ ను పూర్తి చేస్తే దాదాపు సినిమా పూర్తి అయినట్టే. అన్నట్టు ఈ చిత్రంలో విజయ్ రగ్గుడ్ మాస్ లుక్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకి సాలిడ్ సీక్వెల్ ఉన్నట్టుగా ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఈ సినిమా మొదటి పార్ట్ 1 అద్భుత విజయం సాధించాలి. మరి ఈ సినిమా టీజర్, గ్లింప్స్ లాంటివి త్వరలోనే రానున్నాయి. అవి ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

The post సాంగ్ కోసం ‘విజయ్ దేవరకొండ’ రిహార్సల్స్ ! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *